Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఈ అలవాట్లతో డైటింగ్, వ్యాయామం లేకుండానే బరువు తగ్గొచ్చు!

ఈ అలవాట్లతో డైటింగ్, వ్యాయామం లేకుండానే బరువు తగ్గొచ్చు!


ఈ లాక్‌డౌన్‌లో చాలామంది బరువు పెరిగారు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కుర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, కుర్చొని తినడం వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోతారు. గత మూడు నెలల విశ్రాంతి ఎఫెక్టు ఇప్పుడు చూపిస్తోంది. దీంతో అంతా డైటింగ్ చేసే పనిలో పడ్డారు. అయితే.. డైటింగ్, వ్యాయామం చేయకుండానే కొన్ని మంచి అలవాట్లతో బరువు తగ్గవచ్చు. అదెలాగో చూడండి.

బాగా నమిలి తినాలి: ఆహారం వేగంగా తినేవారిలో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి తినేప్పుడు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. తొందరగా కాకుండ నెమ్మదిగా తినాలి. ఇలా చేయడం వల్ల ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటారు. అలాగే ఎక్కువ తింటున్నామనే భావన కూడా కలుగుతుంది. ఇలా కొన్నాళ్లు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు.

పండ్లను తినండి: రోజూ ఒక కప్పు తాజా పండ్లను తీసుకుంటే శరీరానికి ఫైబర్లు అందుతాయి. శారీరక శ్రమ లేనప్పుడు తక్కువ క్యాలరీలు లభించే ఆహార పదార్థాలనే తీసుకోవాలి. దీనివల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది. బరువు పెరిగే అవకాశాలు కూడా ఉండవు.

పోషకాలు ఉండే ఆహారం తీసుకోండి: ప్రోటీన్లు కలిగిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల మంచి ఫుడ్ తిన్నామనే సంతృప్తి కలుగుతుంది. ఆరోగ్యానికి చేటు చేసే చిరుతిళ్లను తినాలనే భావన కూడా కలగదు. ఎక్కువ పోషకాలు, తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు.

నీరు ఎక్కువగా తాగండి: సకల జీవులకు నీరు అమృతం. దీన్నీ ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యం. క్యాలరీలు లేనిది ఏదైనా ఉందంటే.. అది నీరు మాత్రమే. బరువును తగ్గించి, ఆకలి లేకుండా చేస్తుంది. భోజనానికి అరగంట ముందు నీరు తాగితే ఆహారాన్ని తక్కువగా తీసుకోవచ్చు. నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరం కాంతివంతంగా కూడా ఉంటుంది.