Templates by BIGtheme NET
Home >> HEADLINES >> KCR steps towards new leadership

KCR steps towards new leadership


తెలంగాణలో కొత్త చట్టాలతో ప్రక్షాళన చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు పార్టీలో కూడా ప్రక్షాళన మొదలుపెట్టబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ వచ్చాక పదేళ్లుగా పదవుల్లో ఉన్న నాయకత్వానికి మంగళం పాడేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం. కేటీఆర్ తోపాటు పార్టీలో యువనాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

బంగారు తెలంగాణ కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇన్నాళ్లు పదవులు ఇచ్చి కేసీఆర్ విమర్శల పాలయ్యారు. ఉద్యమించిన వారిని విస్మరించారనే అపవాదు తెచ్చుకున్నారు. వ్యతిరేక గళం లేని తెలంగాణ కోసం ఇదంతా చేశాడని పార్టీ వర్గాలు అన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి కొట్లాడిన వారికి పదవులు కల్పించేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో కష్టపడి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి ఈసారి నిరాశపరచకుండా పదవులు కట్టబెట్టేందుకు రెడీ అయినట్టు సమాచారం.

తెలంగాణలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పదవులు ఇచ్చి నిరసన గళాలు వినిపించకుండా ఉండే విధంగా వ్యవహరించాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ బాధ్యతను కేటీఆర్ పై పెట్టినట్టు సమాచారం.