Templates by BIGtheme NET
Home >> Telugu News >> దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

దుమ్మాలపాటి కేసు: జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ


అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది.

అమరావతి భూకుంభకోణంలో తన పేరు చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై ఏపీ హైకోర్టు విచారించింది. అనంతరం దుమ్మాలపాటి శ్రీనివాస్ పై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది.

అలాగే ఎఫ్ఐఆర్ లోని సమాచారాన్ని కూడా ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దుమ్మాలపాటి తరుఫున భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ శ్యాందివాన్ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు అయోగాలు మోపారని పిటీషన్ తరుఫు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు.

రాజధాని భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు.