అమరావతి కుంభకోణం: సిట్ విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం

0

అమరావతి భూముల కుంభకోణంపై వేగంగా వెళ్తున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సిట్ తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

రాజధానిపై ఏర్పాటు చేసిన సిట్ గత ప్రభుత్వ నిర్ణయాలను పున: సమీక్షించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను ఇచ్చింది. ఈ జీవోలు సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారించిన హైకోర్టు తాజాగా సిట్ తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రివర్గం ఉపసంఘం సిట్ దర్యాప్తు ఇదంతా ఒక దురుద్దేశంతో జరిగిందని వర్ల రామయ్య ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిటీషన్ లో పేర్కొన్నారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం పున: సమీక్షించే అధికారం లేదని పిటీషన్ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు.