Templates by BIGtheme NET
Home >> Telugu News >> సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ తరగతులు

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్ లైన్ తరగతులు


కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలు తెరుచుకోలేదు. రెండు మూడు నెలలు వేచి చూద్దామని అనుకున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. వేసవి సెలవులకు ముందు సుమారు రెండు నెలలు ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలలు వృథా అవడంతో పిల్లల చదువు పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ పాఠశాలలు అయితే జూన్ నుంచే ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆ తరగతులను ప్రభుత్వం నిలిపివేసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు ఆన్లైన్ పాఠాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కూడా విద్యా సంవత్సరం వృథా కాకుండా పిల్లలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడంతో అందుకు ప్రభుత్వం కూడా అనుమతించింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి డిజిటల్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.

టీశాట్ దూరదర్శన్ ద్వారా పాఠాలను బోధించనున్నారు. ఇక త్వరలోనే ఆన్ లైన్ తరగతులు ప్రారంభమవనుండడంతో ఆగస్టు 27 నుంచి పాఠశాలకు హాజరు కావాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం వచ్చే నెల 5వ తేదీన పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే కరోనా కేసులు సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడంతో పాఠశాలలను ప్రారంభిస్తా రా..లేదా అనేది సందేహాస్పదంగా మారింది.