Templates by BIGtheme NET
Home >> Telugu News >> కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూత

కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూత


కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూశారు. ఆయన మరణం బీజేపీలో విషాదాన్ని నింపింది. బీహార్ ఎన్నికల వేళ ఈ విషాదం అలుముకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాశ్వన్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇటీవలే గుండె సర్జరీ చేయించుకున్న ఆయన కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వన్ స్వయంగా ప్రకటించారు.

లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడిగా ఉన్న రాంవిలాస్ పాశ్వన్ ఎనిమిది సార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీ కేబినెట్ లో కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.

1946 జులై 5న బిహార్ లోని ఖగారియా జిల్లా షాహర్ బన్నీలో ఓ దళితకుటుంబంలో జన్మించాడు. కోసి కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం పాట్నా వర్సిటీలో పీజీ చేశారు.

1969లో రాంవిలాస్ పాశ్వన్ డీఎస్పీగా ఎంపికయ్యారు. అనంతరం 1969లో తొలిసారి సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిహార్ లో దళిత నేతగా గొప్ప గుర్తింపు పొందారు.

బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన పాశ్వన్ ఐదు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నారు. దేశంలో ప్రముఖ దళిత నేతల్లో ఈయన ఒకరు. ఈయన లోక్ జనశక్తి పార్టీ సారథి.

ప్రస్తుతం ఎన్డీఏ నుంచి లోక్ జనశక్తిని బయటకు వచ్చింది. బీహార్ ఎన్నికల వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు చిరాగ్ బీహార్ లో ఒంటరిగా పోటీచేస్తున్నారు. బీహార్ లో నితీష్ కుమార్ ను వ్యతిరేకిస్తున్నారు. బీహార్ ఎన్నికల వేళ ఆయన చనిపోవడం విషాదం నింపింది.