ఏపీ తెలంగాణకు బీజేపీ కొత్త ఇన్ చార్జిలు వీరే..

0

హార్ ఎన్నికల్లో విజయంతో జోష్ మీదున్న బీజేపీ ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కొత్త ఇన్ చార్జీలను నియమించింది. ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల ఫైర్ బ్రాండ్స్ డీకే అరుణ పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పజెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు ఇన్ చార్జీలు సహ ఇన్ చార్జీలను నియమించారు. ఈసారి సమూళ ప్రక్షళన చేశారు. ఏపీబీజేపీ ఇన్ చార్జికి షాకిచ్చారు.

ఇప్పటికే వివిధ పదవుల్లో ఉన్న తెలుగువారికి బీజేపీ జాతీయ అధ్యక్షడు ప్రాధాన్యత ఇచ్చారు. త్వరలో తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే దుబ్బాకలో బీజేపీ గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ పాగా వేయడానికి బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో కొత్త ఇన్ చార్జీలను నియమిస్తే పార్టీకి బలం చేకూరే అవకాశం ఉన్నందున ఈ మార్పులు చేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న సునీల్ దియోధర్ ను ఆ పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన ప్లేసులో మురళీధరన్ కు బాధ్యతలు అప్పగించారు. సునీల్ దియోధర్ ను సహ ఇన్ చార్జిగా నియమించారు. అలాగే తెలంగాణ ఇన్ చార్జిగా తరుణ్ ఛుగాకు బాధ్యతలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సహ ఇన్ చార్జిగా సత్యకుమార్ కు అవకాశం ఇచ్చారు.

ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఢీకే అరుణకు కర్టాటక సహ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. పొంగులేటి సుధాకర్ రెడ్డిని తమిళనాడు సహ ఇన్ చార్జిగా నియమించారు. ఛత్తీస్ గఢ్ ఒడిశా ఇన్ చార్జిగా దగ్గుబాటి పురంధేశ్వరిని మధ్యప్రదేశ్ ఇన్ చార్జిగా మురళీధర్ రావును నియమించారు.