వైరల్ అవుతున్న ‘రానా-మిహీక’ల 3డి స్ట్రక్చర్ పిక్!!

0

టాలీవుడ్ హీరో రానా అతని భార్య మిహీక బజాజ్ ల ‘కపుల్ కాస్ట్’ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే వీరి ఫోటోలు కొత్తగా పెళ్ళైన జంటలకు ఛాలెంజ్ చేస్తున్నాయి. ఈ మధ్యే రానా మిహీకలు తమ హ్యాండ్ ఇంప్రెషన్స్(అరచేతి ముద్రలను) గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ కోసం హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ కు ఇచ్చారట. అయితే గతేడాది ఆగష్టు నెలలో ఒకటైన ఈ జంట బాలీవుడ్ స్టార్ కపుల్ రన్వీర్ సింగ్ దీపిక పదుకొనేలను అనుసరించినట్లు తెలుస్తుంది. ఇక హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన రానా మిహీకల గురించి సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసింది. అందులో రానా మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ ఫోటో పోస్ట్ చేసింది. అంతేగాక ఫోటోతో పాటు.. ‘మేం హ్యాండ్ ఇంప్రెషన్స్ కోసం రానా మిహీకలను కలిసినప్పుడు వారిద్దరిని చూసి వీరి పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందని అలాగే పర్ఫెక్ట్ కపుల్ అనిపించింది.

అలాగే మేం చేతి ముద్రలను తీసుకునే సమయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించాం. కానీ మేం కళ్లతో వారి ఆనందాన్ని చూసాం’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్టిస్ట్ భావన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రానా మిహీక దీపిక రన్వీర్ లతో పాటు ఆర్టిస్ట్ భావన ఎన్నో జంటలకు ఇలా గోల్డెన్ హ్యాండ్ ఇంప్రెషన్ 3డి స్ట్రక్చర్ తయారు చేసిచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం రానా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే రానా నటించిన పాన్ ఇండియా మూవీ ‘అరణ్య’ విడుదల గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. ఎందుకంటే గతేడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన అరణ్య లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తీరా ఈ ఏడాది మార్చ్ 26న థియేటర్లలో విడుదల కాబోతుంది. తెలుగు తమిళ హిందీ బాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇదేగాక రానా ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చిందని సమాచారం.