అల్లుఅర్జున్ ‘డాన్స్’కి నేనూ అభిమానినే: బాలీవుడ్ హీరో

0

బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ టైగర్ ష్రాఫ్.. ప్రస్తుతం బాలీవుడ్ యువహీరోలలో బెస్ట్ డాన్సర్ అనే సంగతి తెలిసిందే. తన డాన్స్ తోనే బి-టౌన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. టైగర్ డాన్స్ మూవ్స్ అన్ని చాలా సరళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ టైగర్ డాన్స్ వెనక ఎంతో హార్డ్ వర్క్ పట్టుదల దాగి ఉన్నాయనేది నిజం. టైగర్ ఇప్పటి వరకు చేసిన డాన్స్ మూమెంట్స్ చూస్తే కొన్నిసార్లు అతను డాన్స్ కోసం ఎముకలు విరగ్గొట్టుకోడానికి కూడా సిద్ధంగా ఉన్నాడేమో అనే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే టైగర్ సినిమాలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ లతో కూడా అలరిస్తున్నాడు.

అయితే టైగర్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గానే ఉంటాడు. తాజాగా ట్విట్టర్ వేదికగా టైగర్ ష్రాఫ్.. ‘ఆస్క్ టైగర్’ అంటూ ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. ఈ సందర్బంగా టైగర్ ను ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు టైగర్ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చాడు.

ఇక అందులో భాగంగా టైగర్ ను ఓ అభిమాని ప్రశ్న అడిగాడు. ‘అల్లు అర్జున్ లో మీకు నచ్చే అంశాలు ఏమిటి?’ అనే ప్రశ్నకు.. టైగర్ ఇలా బదులిచ్చాడు. ‘చెప్పడం కష్టమే. కానీ నేను అల్లు అర్జున్ మూవ్స్ అండ్ స్టైల్ కి అభిమానిని. నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ తన స్టైల్ అండ్ డాన్స్ మూమెంట్స్ కి దేశవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

అయితే టైగర్ ష్రాఫ్ అదే అల్లు అర్జున్ గురించి ప్రస్తావించినప్పుడు అతని స్టైల్ డాన్స్ అనేవి బి’టౌన్ ప్రజలలో కూడా పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ గురించి ఇలా మాట్లాడటం బాలీవుడ్ లో కొత్తేమి కాదు. ఇదివరకు బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కూడా అల్లు అర్జున్ ఎన్టీఆర్ ల డాన్స్ మూమెంట్స్ లను ప్రశంసించాడు. అలాగే తన డాన్స్ మెరుగు పరుచుకునేందుకు వీరి డాన్స్ సాంగ్స్ గమనిస్తానంటూ చెప్పడం విశేషం. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.