మోనాల్ కు అభిజిత్ ఫ్యాన్స్ సపోర్ట్ తో అతడు ఔట్!

0

బిగ్ బాస్ 4 రసవత్తరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏడుగురిలో హారిక కెప్టెన్ అవ్వడం వల్ల సేవ్ అయ్యింది. నిన్న జరిగిన నామినేషన్ పక్రియలో ఆమె మినహా అంతా పాల్గొనగా లక్ కొద్ది మోనాల్ మరియు సోహెల్ లు సేవ్ అయ్యారు. కాని హారిక కెప్టెన్ హోదాతో ఒక్కరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేసే అవకాశం ను ఇచ్చారు. దాంతో నామినేషన్ లో ఉన్న అభిజిత్ ను సేవ్ చేసి మోనాల్ ను నామినేట్ చేసింది. మోనాల్ ఈ వారం అయినా నామినేషన్ లో ఉండదు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా అభిజిత్ సేవ్ అయ్యాడు.

ప్రతి వారం అభిజిత్ నామినేట్ అవుతున్నాడు. ఎట్టకేలకు ఆయన ఈసారి సేవ్ అయ్యాడు. అభిజిత్ కోసం మోనాల్ నామినేట్ అవ్వాల్సి వచ్చింది. పైగా అఖిల్ తో ఆమెకు గొడవ అయ్యింది కనుక అభిజిత్ అభిమానులు మోనాల్ కు మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. అభిజిత్ అభిమానులు అంతా కూడా మోనాల్ కు మద్దతుగా ఉండి ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఆమె సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అఖిల్ మరియు అరియానాలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ప్రతి సారి సేవ్ అవుతూ వస్తున్నారు. ఈసారి కూడా వారి అభిమానుల ఓట్లు తప్పకుండా వారికి పడుతాయి. కాని తక్కువ సార్లు నామినేట్ అయిన అవినాష్ కు ఎక్కువ మంది ఇప్పటి వరకు ఓట్లు వేయలేదు. కనుక ఒక కంటెస్టెంట్ కు రెగ్యులర్ గా ఓట్లు వేసే వారు ఈ వారం కూడా వారికే ఓట్లు వేయాలని భావిస్తారు.

ఇప్పటి వరకు అవినాష్ చాలా తక్కువ సార్లు నామినేషన్ లోకి వెళ్లడం వల్ల ఆయనకంటూ బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడలేదు. కనుక కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా మరియు మోనాల్ ఇద్దరు కూడా అవినాష్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫాలోవర్స్ చర్చించుకోవడం కనిపిస్తుంది. మొదట్లో అవినాష్ చాలా మంచి పేరు తెచ్చుకున్నా తర్వాత తర్వాత అవినాష్ సో సో అన్నట్లుగా మారిపోయింది. ఆయన టాప్ 5 లో ఉండటమే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారింది. కనుక ఈ వారం ఎలిమినేట్ అవ్వడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ కొందరు బలంగా బల్లగుద్ది చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.