బిగ్ బికి యాక్సిడెంట్ అంటూ ప్రచారం.. మండిపడ్డ స్మాల్ బి

0

గత కొద్ది రోజులుగా అమితాబ్ బచ్చన్ గాయంతో ఆసుపత్రిలో చేరినట్లు మీడియా కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వార్తల్నిబిగ్ బి కుమారుడు అభిషేక్ బచ్చన్ ఖండించారు. తన ఫాదర్ ఫిట్ గా వున్నారని ధృవీకరించడమే కాకుండా తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ ట్రాష్ అని కొట్టి పారేశారు. తన తండ్రి తన కళ్ల ముందే వుంటే ఇలాంటి తప్పుడు వార్తలు ఎలా పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదని వాపోయాడు.

అభిషేక్ మాత్రమే కాదు… అమితాబ్ బచ్చన్ కూడా తాను పూర్తిగా బాగున్నానని ధృవీకరించారు. అయితే బిగ్ బిపై వచ్చిన పుకార్లు ఆయన అభిమానుల్ని మరింత ఆందోళనకు గురిచేశాయి. కొన్ని నెలల క్రితం కోరోనా సోకడంతో అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ బచ్చన్ కూడా ఆసుపత్రిలో చేరాడు. ఐశ్వర్య రాయ్.. ఆరాధ్య కు కూడా కోవిడ్ సోకినట్టు వార్తలు రావడంతో అభిమానులు మరింత ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ ఐశ్వర్య రాయ్.. ఆరాధ్య వెంటనే కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు.

అమితాబ్ బచ్చన్ .. అభిషేక్ బచ్చన్ కూడా కొంతకాలం తర్వాత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత బిగ్ బి తను ఎంతో ఇష్టపడే రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం అమితాబ్ పలు ఆసక్తిరమైన ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అందులో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న`బ్రహ్మాస్త్ర` ఒకటి. ఇందులో అలియా భట్… రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.