ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

0

ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూశారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరు లోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలిసి టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

జయప్రకాష్ రెడ్డి సొంతూరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడుతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టారు. 1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంతో ప్రతినాయకునిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ”సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు” లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు.