అక్కినేని అఖిల్ న్యూ వర్షన్

0

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా 2 బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది. షూటింగ్ బ్యాలన్స్ వర్క్ ను త్వరలో పూర్తి చేయబోతన్నారు. ఇక గత అయిదు ఆరు నెలలుగా పూర్తిగా ఇంటికి పరిమితం అయిన అఖిల్ కండలు పెంచినట్లుగా అనిపిస్తుంది.

ఇటీవల ఆయన షేర్ చేసిన ఫొటోలు ఆయన కొత్త వర్షన్ ను చూపిస్తున్నాయి. తనకు తానుగా చాలా మారాను అంటూ అఖిల్ చాలా చెప్పుకొచ్చాడు. కష్టపడేందుకు సిద్దం అయ్యి వర్కౌట్ చేయడం మొదలు పెట్టాను. నాలో నాకు చాలా మార్పు కనిపించింది. అందుకే దీనిని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాను. ముందు ముందు నాలో మరింత మార్పును చూస్తారంటూ అఖిల్ పేర్కొన్నాడు. ఈ మార్పు అనేది తమకు నచ్చింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అఖిల్ బ్యాచిలర్ మూవీలో సిక్స్ ప్యాక్ చూపించే అవకాశం ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చాలా కూల్ గా కనిపించాడు. మొదటి సినిమాలో మాస్ మసాలా పాత్ర చేసినా కూడా అది పెద్దగా అఖిల్ కు సెట్ అవ్వలేదు అన్నారు. ఇప్పుడు కండలు పెంచడంతో పాటు సిక్స్ ప్యాక్ లో కనిపించడం వల్ల అఖిల్ బ్యాచిలర్ చిత్రంతో మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. వచ్చే సంక్రాంతికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రాబోతున్న విషయం తెల్సిందే.