అలియా చిన్నది ‘ఆర్ ఆర్ ఆర్’ సెట్స్ కొచ్చేది అప్పుడే!

0

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ఆర్ఆర్`. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా చిత్రీకరణ కొన్ని నెలలపాటు వాయిదా పడగా.. రాజమౌళికి పాజిటివ్ రావడంతో మరికొన్ని రోజులు షూటింగ్ డిలే అయింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడడంతో జక్కన్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. విప్లవ వీరులు కొమురం భీమ్ అల్లూరి సీతారామరాజు జీవితాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతుండగా భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అల్లూరిగా రామ్చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అల్లూరి భీమ్ టీజర్లు సోషల్ మీడియాలో పలు రికార్డులను క్రియేట్ చేశాయి. దానికి తోడు బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ మొదలై చాలా రోజులైనా ఇంతవరకు ఆర్ఆర్ఆర్ సెట్ లోకి అలియా అడుగుపెట్టలేదు. ఈనెల మొదటి వారంలో ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరుపనున్నట్లు ముందు యూనిట్ ప్రకటించగా.. అలియా ఆర్ఆర్ ఆర్ సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అలియాభట్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న `గంగూబాయ్ కథియావాడి` సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ముగిసేందుకు మరో రెండు వారాలు సమయం పట్టే అవకాశం ఉందని.. అంతవరకు అలియా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ సినిమా కంప్లీట్ చేసుకున్న తర్వాతే అలియా ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో జాయిన్ అవుతుందని సమాచారం. దీంతో ఆమె రాక కోసం జక్కన్న యూనిట్ వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.