Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘Rx 100’ బ్యూటీ ఫేట్ మారేనా..?

‘Rx 100’ బ్యూటీ ఫేట్ మారేనా..?


అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. ‘Rx 100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ బ్యూటీ క్రేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో రాంగ్ సినిమాలు చేసి.. ఇండస్ట్రీలో బీ గ్రేడ్ హీరోయిన్ గా పేరు తెచ్చేసుకుంది. దీంతో పెద్ద బ్యానర్లు వరుస సినిమాలు చేస్తున్నా వాటిలో పాయల్ కి మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. ఒకవేళ వచ్చినా పెద్దగా ప్రాధాన్యం లేని రోల్స్ లో నటించే ఛాన్సెస్ దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘RDX 100’ లాంటి చిన్న సినిమాలో నటించిన పాయల్.. ‘వెంకీ మామ’ సినిమాలో వెంకటేష్ కి జోడీగా కనిపించింది. ఈ సినిమా హిట్ అయినా పాయల్ కి మాత్రం పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక ‘సీత’ సినిమాలో ఐటెమ్ సాంగ్ కి స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ తర్వాత రవితేజ సరసన ‘డిస్కోరాజా’ సినిమాలో నటించినప్పటికీ అది ప్లాప్ గా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ కు నెగిటివ్ రోల్స్ మరియు వైవిధ్యమైన రోల్స్ తలుపుతడుతున్నా అవి కూడా చిన్నవే అని తెలుస్తోంది. అందుకే ఈ బ్యూటీ అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. చైతన్య కృష్ణతో కలిసి ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాయల్ ‘మల్లిక’ లుక్ ఆకట్టుకుంది. పీరియాడిక్ల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఆహా’ లో నవంబర్ 13న విడుదల కానుంది. అలానే తెలుగులో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘నరేంద్ర’ అనే సినిమాలో నటిస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ సరసన ‘ఏంజెల్’ అనే హారర్ థ్రిల్లర్ లో కూడా పాయల్ రాజ్ పుత్ నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలు సక్సెస్ అయితే అమ్మడి కెరీర్ మళ్ళీ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.