బన్ని- కొరటాల ఆ రేంజులోనే ప్లాన్ చేస్తున్నారట!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భవిష్యత్ ప్రణాళికలు చూస్తుంటే ఇతర స్టార్ హీరోలకు ధీటుగా దూసుకెళ్లేందుకు అతడు వేస్తున్న ఎత్తుగడల్ని అర్థం చేసుకోవచ్చు. వరుసగా సక్సెస్ ఉన్న దర్శకుల్ని లాక్ చేసి ఇండస్ట్రీ రికార్డుల్ని కొట్టాలన్న పంతాన్ని కనబరుస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రీకరణ సాగనుంది. ఇది చిత్తూరు యాస నేపథ్యంలో రఫ్ అండ్ ఠఫ్ యాక్షన్ మూవీ. గంధపు చెక్కల స్మగ్లర్ల కథతో హిందీ మార్కెట్ లోనూ గ్రిప్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో నటించేందుకు బన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవ్ అవుతున్నాడట. అంతేకాదు.. పాన్ ఇండియా స్టాటస్ ను అందుకునేందుకు కొరటాలతో స్క్రిప్టు పరంగా దూరదృష్టితో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కొరటాల స్టైల్లో సామాజిక సందేశంతో పాటు యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథనే ఎంచుకోనున్నారట.

ఇదొక్కటే కాదు.. ఇప్పటికే ఈ మూవీ కోసం పలువురు బాలీవుడ్ నటీనటుల్ని లాక్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప తో పోలిస్తే పరాయి భాషా నటులకే ప్రాధాన్యత ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే కథానాయికగా ఎవరైనా బాలీవుడ్ నాయికనే ఎంపిక చేసే వీలుందని తెలిసింది. బన్ని ఇకపై హిందీలోనూ మార్కెట్ పెంచుకోవాలన్న పంతంతో ఉన్నాడు. ప్రభాస్ కి ధీటుగా ఎదగాలన్న పోటీతత్వంతో ప్రతిదీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టే ప్లానింగ్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఆలియా.. దీపిక.. కత్రిన .. కియరా ఇలా వీళ్లకే కొరటాల- బన్ని మూవీకి ఛాన్స్ ఉండే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.