బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ ని క్యూలో నిలబెడుతున్న ప్రభాస్…!

0

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘వర్షం’ ‘ఛత్రపతి’ సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. టాలీవుడ్ లో క్రమం తప్పకుండా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగారు. అయితే ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ సైతం ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ‘సాహో’ సినిమాకి టీ – సిరీస్ వారిని భాగస్వాములను చేసి.. యావరేజ్ కంటెంట్ తో కూడా రికార్డ్ కలెక్షన్స్ అందుకున్నాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతుంటారు.

కాగా ‘బాహుబలి’ సినిమాని హిందీలో రిలీజ్ చేసిన ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ వెంటనే ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని ట్రై చేసాడు. అలానే యష్ రాజ్ ఫిలిమ్స్ ఆదిత్య చోప్రా కూడా ఎప్పటి నుంచో ప్రభాస్ తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘ధూమ్ 4’ సినిమా కోసం ప్రభాస్ ని సంప్రదించగా.. ఇతర సినిమాల కారణంగా సున్నితంగా తిరస్కరించాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ప్రభాస్ యష్ రాజ్ ఫిలిమ్స్ డీల్ ని పక్కనపెట్టి ‘రాధే శ్యామ్’ మరియు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇప్పటికే మెజారిటీ భాగం ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్.. త్వరలోనే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని సెట్స్ పై తీసుకెళ్లనున్నాడు.

ఇదిలా ఉండగా యష్ రాజ్ ఫిలిమ్స్ 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా హృతిక్ రోషన్ – ప్రభాస్ తో ఓ మూవీ ప్లాన్ చేశారట. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాల్సిన ఈ ప్రాజెక్ట్ ని ప్రభాస్ హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది. అయితే అదే క్రమంలో టీ-సిరీస్ భూషణ్ కుమార్ తో కలిసి ‘ఆదిపురుష్’ అనే భారీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. మరి త్వరలోనే యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రాజెక్ట్ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. ఏదేమైనా బాలీవుడ్ స్టార్స్ కంటే హై రేంజ్ సినిమాలు చేస్తూ తెలుగోడి సత్తా చాటుతున్న ప్రభాస్.. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ ని సైతం క్యూలో నిలబెడుతున్నాడని చెప్పవచ్చు.