బన్ని ఇంకా ఏదో దాచేయాలని చూస్తున్నాడు!

0

ఐకన్ టోపీ.. ఏఏ బ్రాండ్ మాస్క్ .. టాప్ టు బాటమ్ స్పోర్ట్ లుక్ లో విమానాశ్రయంలో దిగిపోయాడు అల్లు అర్జున్. పైగా ఆ పొడవాటి గిరజాల జుత్తుకు టోపీతో కవరింగ్ ఇచ్చాడు. ఆ హెయిర్ స్టైల్ పూర్తి మాసీగా కనిపిస్తోంది. అయితే ఇన్ని రకాలుగా బన్ని కవరింగ్ ఎందుకు చేస్తున్నట్టు? తెలిసిపోకూడదనా? అంటే అవుననే అర్థమవుతోంది.

అల్లు అర్జున్ విమానాశ్రయంలో సడెన్ గా ఇలా ప్రత్యక్షమయ్యారు. ఎక్కడి నుంచి వస్తున్నారో అభిమానులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. చూడగానే `పుష్ప` షూటింగ్ షెడ్యూల్ ని ముగించి ఇలా తిరిగొచ్చారని అర్థమవుతోంది. అతడి గెటప్ చూడగానే ఇంకేదో దాచేస్తున్నాడన్న సందేహాలు వస్తున్నాయి. గంధపు చెక్కల స్మగ్లర్లకు అండగా ఉండే డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్ని నటిస్తున్నారు. ఆ గెటప్ పూర్తి రగ్గ్ డ్ గా రఫ్ అండ్ ఠఫ్ గా ఉంటుందన్నది చెప్పాల్సిన పనే లేదు. ఆ వేషధారణ ఇదీ అని బయటకు తెలియకుండా బన్ని దాచేస్తున్నట్టే కనిపిస్తోంది.

విమానాశ్రయంలో ముసుగుతో ముఖాన్ని కప్పేయగా.. జుట్టును కప్పే టోపీని ధరించాడు. నీలిరంగు ప్యాంటు.. లేత నీలం రంగు టీ-షర్టుతో కనిపించాడు. లుక్ సాధారణం అయినా..స్టైలిష్ కంటెంట్ ఎక్కడా తగ్గలేదు.

ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవిలో సినిమా షూటింగ్ లో పాల్గొన్న బన్ని అక్కడ కుటుంబంతో రిసార్ట్ లో స్టే చేశారు. తొలిసారిగా పాన్-ఇండియన్ స్టార్ గా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ కట్టుదిట్టమైన జాగ్రత్తలు అన్నమాట.