ఫ్రెండుతో కలిసి `ఫైటర్` బ్యూటీ అల్లరి వేషాలు

0

టీనేజీ దాటి యుక్తవయసు సరిగమల్ని ఆస్వాధించేవాళ్లకు తెలుస్తుంది అసలు అల్లరి వేషాల విలువేంటో! ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న స్పెషల్ గాళ్స్ అల్లరి వేషాలు చూస్తుంటే అలాంటిదేదో గుర్తుకు రాక మానదు.

కొంటెగా కవ్వించడం.. చిలిపిగా నవ్వులు చిందించడం.. టెంప్ట్ చేయడం వగైరా వగైరా విషయాల్లో ఇక్కడ కనిపిస్తున్న నటవారసురాలు ఏమాత్రం తగ్గడం లేదు. నటుడు చుంకీ పాండే వారసురాలిగా బాలీవుడ్ లో ప్రవేశించిన అనన్య ఫేజ్ 3 ప్రపంచంలో హాట్ సెలబ్.

షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. సైఫ్ ఖాన్ కుమార్తె సారా ఖాన్ .. బిగ్ బి మనవరాలు నవ్య నవేళి నందా.. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. వీళ్లంతా ఒకటే ఈడు అమ్మాయిలు. కలిసి పార్టీలకు వెళతారు .. క్లబ్బు పబ్బు అంటూ షికార్ చేస్తుంటారు. ఇక ఫేజ్ 3 క్రౌడ్స్ లో షో స్టాపర్స్ గా నిలవాలంటే ఈ భామలు అలా షికార్ కి ఆరుబయట తిరిగేస్తే చాలు. జంక్షన్ జామైపోవాల్సిందే. ఇదిగో ఇక్కడ తన ఫ్రెండుతో కలిసి అనన్య పాండే కొంటె కుర్రాళ్లను తెగ కవ్వించేస్తోంది. అదిరిపోయే థై షోస్ తో స్పెషల్ ట్రీటిస్తున్నారు మరి. అన్నట్టు అనన్య అందచందాలకు అల్లరి వేషాలకు `ఫైటర్` కోస్టార్ విజయ్ దేవరకొండ ఫిదా అయిపోకుండా ఉన్నాడా? ఏమో.. ఆయనే చెప్పాలి.