ప్రభాస్ కు క్రష్ .. ఆ క్లాసీ హీరోయిన్ పై..?

0

ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తర్వాత అంతటి క్రేజు ఉంది మన బ్యాచిలర్ ప్రభాస్ కి. పెదనాన్న కృష్ణంరాజు పిల్లను వెతుకుతున్నా కానీ.. చేసుకుంటానని చెప్పడు! అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అసలు పెళ్లి ఊసే ఎత్తడు. అతడు .. ఊ.. అనాలే కానీ ఇండస్ట్రియలిస్టులు.. రాజకీయ నాయకులు.. సినీసెలబ్రిటీల కుటుంబాల నుంచి ఈడొచ్చిన భామలు జోడీ కట్టేసేందుకు రెడీగా ఉన్నారు. కానీ అందుకు ససేమిరా అనేస్తున్నాడు డార్లింగ్.

అదంతా సరే కానీ.. అసలు ప్రభాస్ కి ఎవరిపైనా క్రష్ అన్నదే లేదా? అంటే.. ఎందుకు లేదు. ప్రభాస్ కి ఓ క్లాసీ హీరోయిన్ పై క్రష్ ఉందట. ఆ సంగతిని ఆవిడే స్వయంగా వెల్లడించడం షాకిచ్చింది. ఓ సరదా చిట్ చాట్ లో మాజీ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ మాట అన్నారు. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న క్లాసిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ `రాధే శ్యామ్` లో భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో భాగ్యశ్రీ తన సహనటుడు ప్రభాస్ వినయపూర్వకమైన ప్రవర్తనకు ఫిదా అయిపోయానని తెలిపారు. సెట్లలో అతని డౌన్ టు ఎర్త్ స్వభావంపై ప్రశంసలు కురిపించారు.

తాజా ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ ఎంతో ఫన్నీ విషయాన్ని వెల్లడించారు. రాధే శ్యామ్ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ ఒకసారి తన వద్దకు వచ్చి క్రష్ ఉందని చెప్పారట. అదంతా జస్ట్ ఫన్నీ థింగ్ అని తెలిపారు. రాధే శ్యామ్ బృందం తనను బాగా చూసుకుందని .. హైదరాబాదీ స్వీట్లను కూడా బహుమతిగా ఇచ్చారని ఆమె చెప్పింది. రాధే శ్యామ్ చిత్రంలో ఎంతో అందమైన ప్రేమ కథ ఉందని.. దాన్ని ఆస్వాధించాలంటే సినిమా చూడాల్సిన అవసరం ఉందని సదరు సీనియర్ నటి అన్నారు.

దాదాపు 3 దశాబ్దాల తరువాత భాగ్యశ్రీ తిరిగి నటిగా ముఖానికి రంగేసుకున్నారు. ఇదే నటిగా తనకు తొలి తెలుగు సినిమా. ఇంకా ఈ చిత్రంలో పలువురు అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్- యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.