‘ఖిలాడి’ కోసం జబర్దస్త్ హాటీ

0

రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కి విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను ముగించిన రవితేజ ఇటీవలే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమాపై రవితేజ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతీ మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మరింత అందం తీసుకు వచ్చేందుకు గాను జబర్దస్త్ బ్యూటీ హాట్ యాంకర్ అనసూయను నటింపజేస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.

అనసూయ ఒక వైపు బుల్లి తెరపై ఎంటర్ టైన్ చేస్తూనే మరో వైపు వెండి తెరపై వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తుంది. హీరోయిన్ గా నటించకుండానే మంచి పాత్రల్లో కనిపిస్తుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత అనసూయ క్రేజ్ బాగా పెరిగింది. ఆమెకు అందాల ఆరబోత పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు ఆచార్య మరియు రంగమార్తాడ సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈమె ఖిలాడి సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఖిలాడి సినిమాను వచ్చే ఏడాది ద్వితాయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.