అనసూయ నాకస్సలు నచ్చేది కాదు

0

జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఈ పేరును తెలుగు బుల్లి తెర మరియు వెండి తెరు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లి తెర నుండి వెండి తెర వరకు ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో తనదైన ముద్ర వేసిన అనసూయను లీడ్ రోల్స్ కోసం కూడా సంప్రదిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజు జోరు ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. అంతగా బ్రాండ్ అయిన అనసూయ పేరు అంటే అనసూయకు ఇష్టం లేదట.

తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న అనసూయ పలు వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఇప్పుడు మిమ్ములను పవిత్ర అని పిలవాలా లేదంటే అనసూయా అంటూ పిలవాలా అంటూ అలీ ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. అమ్మ నాకు పవిత్ర అని పేరు పెట్టింది. అయితే నాకు గుర్తు తెలియని సమయంలోనే నాన్న పేరు మార్చాడు. నాన్న తరపు ఫ్యామిలీలో నేను మొదటి అమ్మాయిని. అందుకే వారి అమ్మ పేరుతో నాన్న నాకు అనసూయ అంటూ పేరు పెట్టారు. స్కూల్ ల్లో నన్న అంతా అనసూయ అంటూ అంత పెద్దగా పిలుస్తుంటే నాకు చిరాకుగా ఉండేది.

స్కూల్ లో అందరు నన్ను అను అంటూ పిలవాలని చెప్పేదాన్ని. స్కూల్ రిజిస్ట్రర్ లో కూడా నా పేరు అను అని ఉంటుంది. అనసూయ అంటే పలికేదాన్ని కాదు. కాలేజ్ ఎన్సీసీ కి వెళ్లిన సమయంలో నా పేరు విషయంలో జ్ఞానోదయం అయ్యింది. అప్పటి నుండి నా పేరు అనసూయ అంటూ నేనే గర్వంగా చెప్పుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. భరద్వాజ్ తో ప్రేమ విషయంలో కుటుంబ సభ్యులు అస్సలు ఒప్పుకోలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితిలో నాన్నకు తెలియకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అనసూయ పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంది.