‘అంటే.. సుందరానికీ!’ అనే క్రేజీ టైటిల్ తో వస్తున్న నేచురల్ స్టార్ నాని..!

0

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఒక వైపు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే మరోవైపు పక్కింటబ్బాయి తరహా పాత్రలతో నాని ప్రేక్షకుల్లో అమితమైన ఆదరాభిమానాలను సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో నాని ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒరిజినల్ స్టోరీతో మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – రవిశంకర్ వై. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే #నాని28 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో నానికి ఉన్న ఆదరాభిమానాలకు తగ్గట్లుగా ఈ చిత్రానికి ”అంటే.. సుందరానికీ!” అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం ‘అంటే.. సుందరానికీ!’ టైటిల్ అనౌన్స్ మెంట్ కి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ క్రేజీ వీడియోకి సినీ అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇందులో నాని లుక్ కొత్తగా ఉండటంతో పాటు టైటిల్ డిజైన్ ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో ప్రకారం ఈ మూవీ ఆద్యంతం హాస్యభరిత సన్నివేశాలతో రూపొందనుందని అర్థమవుతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ‘అంటే.. సుందరానికీ!’ సినిమా 2021లో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచనుందని స్పష్టం అవుతోంది. ఇక ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. వివేక్ ఆత్రేయ మునుపటి చిత్రాలకు మంచి మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికీ స్వరాలు కూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్ గా వర్క్ చేస్తుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే మిగతా తారాగణం సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.