సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీసర్కార్

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

ప్రభుత్వ స్థలాలు ప్రాంగణాల్లో షూటింగ్ లు నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. కరోనా వైరస్ తో ఆగిపోయిన సినిమా షూటింగ్ లను తాజాగా పునరుద్ధరిస్తున్నట్టు ఆయన తెలిపారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న జారీ చేసిన మార్గదర్శకాలు.. ఎస్ఓపీలతో రాష్ట్రంలో తిరిగి సినిమా షూటింగ్ లు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే చిత్రీకరణ సమయంలో యూనిట్ అందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు ధరించి.. శానిటైజర్లు వాడాలని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. టాలీవుడ్ సినీ నిర్మాతలు ఏపీలో షూటింగ్ లకు రావాలని కోరారు.