ఎఫ్ 3 కి ముందే ఫిదా చేయబోతున్నాడు

0

గత ఏడాది ఎఫ్ 2 తో సక్సెస్ అందుకున్న అనీల్ రావిపూడి ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరో సినిమాను విడుదల చేయాలనుకున్న ఈ దర్శకుడికి కరోనా బ్రేక్ వేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి కాకున్నా సమ్మర్ వరకు అయినా ఒక సినిమాను తీసుకు రావాలని అనీల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 కథ సిద్దం చేశాడు. కాని వరుణ్ మరియు వెంకీలు వచ్చ ఏడాది సమ్మర్ తర్వాత కాని ఫ్రీ అయ్యే అవకాశం లేదు. అందుకే ఈ గ్యాప్ లో ఒక చిన్న సినిమాను లాగించేయాలని భావిస్తన్నాడట.

తన వద్ద ఉన్న ఓ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ తో హీరోయిన్ సాయి పల్లవిని ఫిదా చేశాడట. దాంతో ఆమె బిజీగా ఉన్నా కూడా నటించేందుకు ఓకే చెప్పిందట. ఫిదా సినిమాలో భానుమతి వంటి హైపర్ యాక్టివ్ పిల్ల పాత్రలో సాయి పల్లవిని అనీల్ రావిపూడి చూపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు.

సాయి పల్లవితో దాదాపు మూడు నెలల్లోనే ఈ సినిమాను ముగించేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. అన్ని అనుకుంటే ఏప్రిల్ లేదా మే లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో దర్శకుడు ఉన్నాడట. ఎంటర్టైన్ మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న అనీల్ లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవితో ఏ స్థాయిలో ఈయన ఎంటర్ టైన్ చేస్తాడో..!