ఒకరేమో ఉద్యమ సేనాని కేసీఆర్.. పైగా ముఖ్యమంత్రి.. మరొకరేమో టాలీవుడ్ లెజెండ్. ఇద్దరివీ వేర్వేరు దారులు..కానీ ఇద్దరూ కలిశారు. తన తండ్రి ఎన్టీఆర్ కు గౌరవమిచ్చిన కేసీఆర్ ను కలిసి బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇక తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్ పై అభిమానాన్ని కేసీఆర్ ఇలా తీర్చుకున్నాడని చెప్పొచ్చు.
టాలీవుడ్ అగ్ర హీరో ఏపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని భవిష్యత్ తరాలకు తెలిపేలా తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోకి కేసీఆర్ ఎక్కించడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా ఆయన స్పందించారు.
‘కళకి కళాకారులకి విలువను పెంచిన కథానాయకుడు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ అన్నగారు మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు.
పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని ముద్రించడంపై నందమూరి ఫ్యామిలీలో హర్షం వ్యక్తం అవుతోంది. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. పేదలకు రూ.2కే కిలో బియ్యం మధ్యాహ్నం భోజన పథకం మధ్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఎపిసోడ్ను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించడం విశేషం.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
