మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్.. రోజాపై ఆసక్తికర కామెంట్

0

ఊరికే రారు మహాత్ములు అన్నట్టు నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తూ.. పోస్ట్ షేర్ చేస్తూ బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా రోజా ఫొటో షేర్ చేసి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు బండ్ల గణేష్ కు కొంత కాలం క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్ లో గొడవ జరిగింది. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన రోజాపై బండ్ల గణేష్ బూతులతో విరుచుకుపడ్డారు. రోజా కూడా నోటికి పనిచెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరికీ మాటలు లేవు.

అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఫంక్షన్ కు హాజరైన వీరిద్దరూ పాత పగలన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుతూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్.. ‘చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని.. ఆమెకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

కొంతకాలం క్రితం జరిగిన వివాదాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఇలా కలిసిపోవడం అభిమానులకు సంతోషాన్ని పంచింది. రాజకీయంగా వేరుదారులైనా సినీ ఇండస్ట్రీ పరంగా తామిద్దరం ఒకటేనని బండ్ల ఈ ట్వీట్ తో నిరూపించినట్టైంది.