పవన్ కళ్యాణ్ భార్యగా నటించేందుకు ఆ బ్యూటీ ఒప్పుకోలేదా..?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైన్లో పెట్టిన సినిమాలలో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ ఒకటి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను పవన్ పోషించనున్నారు. పృథ్వీరాజ్ పాత్రలో యువ హీరో నితిన్ లేదా కన్నడ హీరో సుదీప్ ను తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనుందనే వార్త ప్రచారంలో ఉంది. అయితే సాయి పల్లవి పవన్ కళ్యాణ్ భార్య పాత్రను రిజెక్ట్ చేసిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

మలయాళ వర్షన్ లో పోలీస్ ఆఫీసర్ భార్య పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ నిడివి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ సినిమా స్టోరీ మొత్తం ఇద్దరు హీరోల చుట్టూనే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి నటింగా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించిందని చెప్పుకుంటున్నారు. సాయిపల్లవి ఇంతకముందు మెగాస్టార్ చిరంజీవి నటించే ‘వేదలమ్’ రీమేక్ లో చెల్లెలి పాత్రను రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్న ‘ఫిదా’ బ్యూటీ అలాంటి పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. పవర్ స్టార్ హీరో కాబట్టి నిడివి తక్కువున్న ఆ పాత్రలో స్టార్ హీరోయిన్ ని లేదా ఫేమస్ బ్యూటీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో తెలుగమ్మాయి అంజలి ని ఈ రోల్ కోసం సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి చివరకి పవన్ భార్య పాత్రకి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.