కాజల్ పెళ్లి పై బెల్లంకొండ రియాక్షన్…!

0

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ – స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ల గురించి ఎప్పుడూ ఏవేవో వార్తలు వస్తూనే ఉంటాయి. ‘కవచం’ ‘సీత’ సినిమాల్లో కలిసి నటించిన బెల్లంకొండ – కాజల్ ల మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని సోషల్ మీడియా కోడై కూసేది. దీనికి తగ్గట్టే వీరు సోషల్ మీడియా మాధ్యమాలలో సన్నిహితంగా ఉంటూ అప్లోడ్ చేసే ఫోటోలు.. కలిసి సెలబ్రేట్ చేసుకునే పార్టీలు ఈ వార్తలు నిజమేనేమో అనే అనుమానాలు కలిగించేవి. మీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతోన్నారా? మీ మధ్య ఏం నడుస్తోంది? అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపించేవారు. అయితే ఇప్పుడు కాజల్ అగర్వాల్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో వారిద్దరి మధ్య ఉన్నదీ స్నేహం మాత్రమే అని అందరూ కంక్లూషన్ కి వచ్చేసారు.

కాజల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని శుక్రవారం వివాహం చేసుకుంది. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో జరిగిన వేడుకలో తన ప్రియుడు గౌతమ్ తో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది చందమామ కాజల్. కరోనా కారణంగా కుటుంబసభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మార్వాడీ సంప్రదాయ పద్దతిలో ఈ వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు కాజల్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కాజల్ పెళ్లి చేసుకున్న సందర్భంగా ట్విట్టర్ వేదికగా విషెస్ తెలియజేసాడు. ‘కంగ్రాట్స్ కాజల్!! నువ్వు మరియు జీకే బ్రో కలిసి సంతోషంగా ఉండాలి’ అని బెల్లంకొండ ట్వీట్ చేసాడు. ఇంతకముందు కాజల్ పెళ్లి గురించి సందర్భంగా ‘కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్ కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్ లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి’ అని శ్రీనివాస్ పేర్కొన్నాడు.