బిబి4 లీక్ : లాస్య ఎలిమినేట్

0

బిగ్ బాస్ ఎలిమినేషన్ కు సంబంధించి ప్రతి వారం లీక్ వస్తూనే ఉంది. ఈ వారం కూడా లీక్ వచ్చేసింది. నేటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వబోతున్నది లాస్య అంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది. మోనాల్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె మరోసారి సేవ్ అయ్యింది. అత్యధికసార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయిన మోనాల్ మరోసారి సేవ్ అయ్యింది. మొన్నటి టాస్క్ లో హారికను మోనాల్ కెప్టెన్ గా చేసిన తీరు అందరికి బాగా నచ్చింది. ఆ కారణంగా ఆమెకు ఎక్కువ ఓట్లు పడ్డాయనేది కొందరి మాట.

ఏది ఏమైనా నేటి ఎపిసోడ్ లో లాస్య ఎలిమినేట్ అవ్వబోతుంది. ఫైనల్ 5 కంటెస్టెంట్ అంటూ లాస్య పేరు బలంగా వినిపించింది. కాని ఆమె ఇలా బయటకు వస్తుందని ఎవరు ఊహించలేదు. అనూహ్యంగా ఆమె బయటకు రావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఎప్పటిలాగే మోనాల్ ను కాపాడుతూ లాస్యను ఎలిమినేట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. లాస్య బలమైన కంటెస్టెంట్. ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉంది. అయినా కూడా ఆమె ఎందుకు ఎలిమినేట్ అయ్యిందో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.