Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈసారి కూడా చిరు చేతుల మీదుగానే..!

ఈసారి కూడా చిరు చేతుల మీదుగానే..!


తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే ఎపిసోడ్ కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసమయంలో ఈ సీజన్ ప్రత్యేక గెస్ట్ ఎవరై ఉంటారా అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ విజేతకు ఎన్టీఆర్ స్వయంగా ట్రోఫీని అందజేశాడు. ఇక రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించగా వెంకటేష్ విజేత కౌశల్ కు ట్రోఫీని అందించాడు. ఇక నాగార్జున హోస్టింగ్ చేసిన మూడవ సీజన్ కు గాను ఫినాలే ఎపిసోడ్ గెస్ట్ గా చిరంజీవి వచ్చాడు. చిరు చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ అందుకున్నాడు. నాల్గవ సీజన్ విజేతకు ఎవరి చేతుల మీదుగా ట్రోఫీని ఇప్పించబోతున్నారు అనేది చర్చనీయాంశం అయ్యింది.

ఎన్టీఆర్ మరియు మహేష్ బాబుల పేర్లు ప్రముఖంగా వినిపించినా కూడా మరోసారి చిరంజీవితోనే విజేతకు ట్రోఫీని ఇప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది. మూడవ సీజన్ కు వచ్చిన చిరంజీవినే మళ్లీ నాల్గవ సీజన్ కు గెస్ట్ గా రాబోతున్నాడు. ప్రస్తుతం హీరోల్లో పలువురు బిజీగా ఉండటంతో పాటు కొందరు ఆసక్తిగా లేరు. కనుక చిరంజీవి అయితేనే గౌరవంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆయన్నే మళ్లీ నాగార్జున ఆహ్వానించాడనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కూడా మా టీవీతో ఉన్న అనుబంధం దృష్ట్యా వచ్చేందుకు ఓకే చెప్పారట. ఆదివారం ఎపిసోడ్ కోసం అంతా రెడీ అవుతుంది. ఫినాలే గ్రాండ్ గా ఉండేలా ఏకంగా మూడు గంటల పాటు ప్రసారం చేసేలా నిర్వాహకులు ఇప్పటికే కార్యక్రమాలు ప్లాన్ చేశారు.