Templates by BIGtheme NET
Home >> Cinema News >> హాట్ సింగర్ కం నటిని వెంటాడిన కొంటె అభిమాని

హాట్ సింగర్ కం నటిని వెంటాడిన కొంటె అభిమాని


అభిమానం హద్దు మీరితే అంతేగా. ఆ హాట్ సింగర్ ని సదరు అభిమాని తనదైన శైలిలో అటకాయించాడు. నువ్వే నా కల.. నా జీవితం.. నా స్వర్గం .. నా సర్వస్వం“ అంటూ తన్మయంతో తపించిపోతూ వెంటపడ్డాడు మరి. ఇంతకీ ఎవరి వెంట పడ్డాడో చెప్పాల్సిన పనే లేదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న హాట్ సింగర్ కం నటి షామా శికందర్ గురించి అతడు అంతగా తపించిపోయాడు. లేటెస్ట్ గా షామా ఇన్ స్టాలో ఓ అందమైన ఫోటోని షేర్ చేసి అదిరిపోయే వ్యాఖ్యానాన్ని జోడించగా దానికి అతడు ఫిదా అయిపోయి అలా స్పందించాడు. “గడిచిన కాలంలో మీరు ఎలా మ్యానేజ్ చేసారో దానికి గర్వపడండి. మీరు పోరాడిన నిశ్శబ్ధ యుద్ధాలు.. మిమ్మల్ని మీరు వినయంగా మార్చుకోవాల్సిన క్షణాలు.. మీ స్వంత కన్నీళ్లను తుడిచివేసి… ప్రతిదానికి ధీటుగా నిలవండి. మీ బలాన్ని పెంచుకోండి“ అంటూ షామా స్వీట్ మెసేజ్ ఇచ్చింది ఇన్ స్టాలో.

ఇక షామా షేర్ చేసిన ఫోటోలకు మంత్రముగ్ధం అయిన వేరొక అభిమాని “వావ్ నైస్ స్మైల్ .. అందమైన రాణి .. చక్కని హెయిర్ స్టైల్.. మంచి కళ్ళు.. నిజంగా రాణి నైస్ డ్రెస్ బాగుంది..“ అంటూ మైమరిచిపోయాడు.

“మీకు సరే అనిపించేలా నా దగ్గర మధురమైన పదాలు ఉండకపోవచ్చు.. నా దగ్గర బంగారం.. వజ్రాలు ఉండకపోవచ్చు ..కానీ నిన్ను పట్టుకోవడానికి నా చేతులు ఉన్నాయి .. మీ మాట వినడానికి చెవులు ..రోజూ మిమ్మల్ని చూడటానికి కళ్ళు ఉన్నాయి. ప్రతి సెకను నిన్నే ప్రేమిస్తున్నాను… నేను నీకు మొదటి కలయికలో ముద్దు లేదా ప్రేమ కాకపోవచ్చు… కానీ నేను మీ చివరి తేదీకి ప్రతిదీ అవ్వాలనుకుంటున్నాను..“ అంటూ ప్రేమకవిత్వంతో షామా అందానికి ఫిదా అయిపోతూ హీటెక్కే కవితలు చెప్పాడో ఫ్యాన్స్.

40 వయసులోనూ అగ్గి రాజేస్తున్న షామాకు అంతకంతకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోవడానికి ఇన్ స్టాలో తను షేర్ చేసే బికినీ ఫోటోలేననడంలో ఎలాంటి సందేహం లేదు.