వెంటాడుతున్న గతంః నటుడిని అరెస్టు చేయాలని ఉద్యమం

0

సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత.. ఎప్పుడు ఏ విషయం బయటకు వస్తుందో తెలియట్లేదు. ఏ విషయం ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియట్లేదు. తాజాగా.. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ఇదే విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఆయన్ను అరెస్టు చేయాలంటూ.. సోషల్ మీడియాలో భారీ ఉద్యమమే నడుస్తుండడం గమనార్హం. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమంటే..?

గతంలో ఓ కామెడీ షోకు హాజరయ్యాడు రణదీప్. ఈ సందర్భంగా ఆయన ఓ జోక్ పేల్చాడు. అది ఎవరి మీద అంటే.. కుమారి మాయవతి మీద. అది సాధారణ జోక్ కాదు. సెక్స్ కు సంబంధించినది. ఇందులో కాస్త వల్గారిటీ కూడా ఉంది. ఈ కార్యక్రమం జరిగి చాలా కాలమైంది. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో అది ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.

దాన్ని ఎవరు బయటకు తెచ్చారో తెలియదుగానీ.. #Arrestrandeephooda అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. దీంతో.. ఇది నేషనల్ లెవల్లో భారీగా ట్రెండ్ అవుతోంది. దళితనేత అందునా మహిళ అయిన మాయావతిపై ఇలాంటి జోకులు వేయడం ఏంటని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇది ఖచ్చితంగా దళితులను కించపరచడమేనని మండిపడుతున్నారు.

ఇందుకు గానూ.. రణదీప్ హుడాను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం అది కామెడీ షో కాబట్టి హాస్యంగానే తీసుకోవాలని అదే సమయంలో ఎప్పుడో జరిగిపోయిన దాన్ని బయటకు తెచ్చి ఇప్పుడు అరెస్టు చేయాలని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ విషయమై చినికి చినికి గాలివానలా మారింది. ఇది.. చల్లారుతుందా? ముదురుతుందా? అన్నది చూడాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో.. బీ కేర్ ఫుల్ ఎవ్రీ వన్.