13 రోజుల లాక్ డౌన్.. డైల్ 100 కి కాల్ చేస్తున్న గృహ హింస బాధితులు !

0

అందరూ ఎవరి పనుల్లో వారు వెళితే ఆ ఇల్లు స్వర్గ సీమ. అదే అందరూ ఇంట్లోనే ఉంటే నరకం.. కోపతాపాలు ఆగ్రహావేశాలు అది కావాలి.. ఇది కావాలి.. అది చేసి పెట్టు అని పోరు పెడుతూ మహిళలను హింసించుకు తింటున్నారు. అవును.. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ వేళ మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు.

సాధారణ రోజుల్లో కేసులతో పోలిస్తే లాక్ డౌన్ లో నమోదైన గృహ హింస కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. అందరూ ఇళ్లలోనే ఉండడంతో మహిళలపై పనిభారం పెరుగుతోందన్నారు.బయటకు వెళ్లే పరిస్థితి లేక.. పనిలేక.. మగవారు ఫ్రస్టేషన్ కు గురికావడం.. ఇదంతా ఇళ్లలోనే ఉండే మహిళలపై చూపించడంతో గొడవలు మొదలవుతున్నాయని డీజీ స్వాతి లక్రా తెలిపారు.

ఇక పిల్లలు కూడా స్కూల్స్ కాలేజీలు లేక ఇంట్లోనే ఉండడంతో మహిళలకు తీవ్ర పనిభారం పెరుగుతోంది. వారి చికాకులు.. మగవారు ఫ్రస్ట్రేషన్లు అన్నీ ఇంట్లో ఉండే ఆడవారి మీద చూపించడంతో వారు అటు పని ఒత్తిడి.. ఇటు ఉద్యోగినులు అయితే వర్క్ ఫ్రం హోంతో సతమతమవుతున్నారని తెలిపారు.

సెకండ్ వేవ్ లో పెట్టిన కరోనా లాక్ డౌన్ లో 13 రోజుల్లోనే గృహహింసకు గురైన బాధితులు తమకు ఫోన్ చేస్తున్నారని.. డయల్ 100కు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. గృహహింసకు గురవుతున్నవారు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీ స్వాతి తెలిపారు.

ఈ లాక్ డౌన్ లో అందరూ ఇంట్లో ఉండడంతో గృహహింస కేసులు పెరుగుతున్నాయని ఈ సమయంలో షీటీమ్స్ పనిచేస్తున్నాయని.. మహిళలు బయటకు రాకుండానే 100కు ఫోన్ చేస్తే తక్షణం స్పందిస్తామని స్వాతి లక్రా తెలిపారు.