డ్యామ్ వద్ద బట్టలిప్పేసిన హీరోయిన్.. కేసు నమోదు

0

బాలీవుడ్ హాట్ బాంబ్ ప్రముఖ హీరోయిన్ పూనం పాండేపై కేసు నమోదైంది. గోవాలోని కనకోవా పోలీస్ స్టేషన్ లో ఈ కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే పలు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ఆమె నిబంధనలకు విరుద్ధంగా గోవాలో ప్రవర్తించడంతో తాజాగా కేసు నమోదైంది.

ప్రభుత్వ స్థలమైన చపోలీ డ్యామ్ వద్ద పూనంతో అసభ్యంగా వీడియో తీస్తున్న ఓ అజ్ఞాత వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పూనంపై కేసు పెట్టింది. ఇలా చేయడం చపోలీ డ్యామ్ పవిత్రతను.. గోవా సంస్కృతిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

ఇక కరోనా వైరస్ విజృంభించిన మేనెలలోనూ పూనమ్ పాండే అప్పటి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అప్పుడు కేసు నమోదైంది. కరోనా లాక్ డౌన్ నిబంధనలు పూనం అతిక్రమంచి బీఎండబ్ల్యూ కారులో మెరైన్ డ్రైవ్ చేసిన పూనంపై నాడు ముంబై పోలీసులు కేసు నమోదు చేసి బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు.

పూనం పాండే 2013లో ‘నషా’ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైంది. ఆగయా హీరో ద జర్నీ ఆఫ్ కర్మ సినిమాల్లో నటించింది.