Templates by BIGtheme NET
Home >> Cinema News >> Chiranjeevi : చిరంజీవి ఇంట్లో ఆమీర్ ‘లాల్ సింగ్ చద్ధా’ ప్రివ్యూ.. హాజరైన నాగ్, రాజమౌళి, సుకుమార్, చైతూ..

Chiranjeevi : చిరంజీవి ఇంట్లో ఆమీర్ ‘లాల్ సింగ్ చద్ధా’ ప్రివ్యూ.. హాజరైన నాగ్, రాజమౌళి, సుకుమార్, చైతూ..


Chiranjeevi – Laal Singh Chaddha Movie Preview : బాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్ధా’. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగ చైతన్య మరో కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూను టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్ధా’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూను హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు హీరో ఆమీర్ ఖాన్.

ఈ చిత్రంలో నాగ చైతన్య దక్షిణాదికి చెందిన బబ్లూ అనే యువకుడి పాత్రలో నటించారు. కథను కీలక మలుపు తిప్పే అతికీలకమైన ఆ క్యారెక్టర్. ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ విషయానికొస్తే.. ఈ సినిమాను హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్, నాగ చైతన్య సైనికుల పాత్రలో నటించారు.

చిరంజీవి ఇంట్లో ప్రదర్శించిన ఈ ప్రివ్యూకు దర్శకుడు రాజమౌళి, సుకుమార్‌తో పాటు నాగార్జున, నాగ చైతన్య హాజరయ్యారు. అంతేకాదు ఈ సినిమా వీక్షించి ఆమీర్ ఖాన్‌తో పాటు నాగ చైతన్య నటనను కొనియాడారు.సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఆమీర్ ఖాన్.. ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరు పెంచారు.

మొత్తంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లతో రాజమౌళి, పుష్ప మూవీతో సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్.. తన సినిమా ప్రివ్యూ కోసం వీళ్లిద్దరిని ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ ప్రివ్యూ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. (Twitter/Photo)