మెగాస్టార్ 153 ముహూర్తం ఫిక్స్

0

మెగాస్టార్ చిరంజీవి ఎనిమిది నెలల తర్వాత ఈనెల 9వ తారీకు నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఆచార్య సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు అధికారికంగా డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇంతకు ముందుతో పోల్చితే ఈసారి షెడ్యూల్ ను కుదించి తక్కువ రోజుల్లోనే సినిమాను షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లోనే ఆచార్యకు గుమ్మడి కాయ కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఆచార్య షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరు 153 సినిమాను మొదలు పెట్టబోతున్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం ను మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. నటీ నటుల ఎంపికపై దర్శకుడు మెహర్ రమేష్ దృష్టి పెట్టాడు. సినిమాలో హీరో పాత్రకు చెల్లిగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. వేదాళం రీమేక్ కు జనవరి 18న ముహూర్తం ఫిక్స్ చేశారట.

సంక్రాంతి తర్వాత వెంటనే వేదాళం రీమేక్ ను పట్టాలెక్కించేందుకు రెడీగా ఉండాలంటూ ఇప్పటికే మెహర్ రమేష్ కు చిరు సూచించారట. స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక మరియు లొకేషన్స్ కు సంబంధించిన విషయాలపై చర్చ జరుగుతోంది. ఆచార్య సినిమా విడుదలకు ముందే వేదాళం రీమేక్ పట్టాలెక్కబోతుంది. ఆచార్య మరియు చిరు వేదాళం కేవలం నెల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.