ఫ్యాషన్ Vs సినీ వరల్డ్.. ఇకపై అంతా వర్చువల్ రియాలిటీ

0

కరోనా మహమ్మారి అన్నిటినీ మార్చేస్తోంది. జూమ్ లో జాబ్ చేయాల్సిన రోజులొచ్చాయ్. మీటింగులన్నీ అక్కడే. సాఫ్ట్ వేర్ జాబేనా అన్ని ఇండస్ట్రీలు దీనిని ఎంకరేజ్ చేస్తున్నాయి. మునుముందు ఈ ఉద్యోగాలన్నీ వర్చువల్ రియాలిటీ ప్రపంచానికి షిఫ్టయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ఇంట్లో తెల్ల గోడనే స్క్రీన్ గా మలుచుకుని ఉద్యోగాలు నడిపించేయొచ్చు. ఆ గోడమీదే బాస్ కనిపిస్తారు. సలహాలు సూచనలు ఇస్తారు. ఉద్యోగులు అనుసరిస్తారు. ఇదే అడ్వాన్స్ మెంట్ అంటే. భవిష్యత్ మొత్తం కొత్తగా వింతగా హాలీవుడ్ సినిమాలా ఉంటుంది అని అంచనా వేస్తుంటేనే ఎగ్జయిట్ మెంట్ పెరుగుతోంది. సమయం పట్టినా అలా ప్రపంచం వర్చువల్ రియాలిటీకి మారాలనే ఆశిద్దాం.

అదంతా సరే కానీ.. కరోనా ముందు కరోనా తర్వాత సినీపరిశ్రమల్ని ఫ్యాషన్ ఇండస్ట్రీల్ని చూస్తే అంతా మారిపోయింది. ఇప్పుడంతా వర్చువల్ మాయలాగే అనిపిస్తోంది. జూమ్ కాలింగ్ విస్త్రతి అమాంతం పెరిగింది. దర్శకరచయితలు వినిపించే కథలు వినాలన్నా.. లేదా టెక్నికల్ విషయాల్ని ముచ్చటించాలన్నా ప్రతిదీ జూమ్ కాలింగే. ఇక ఫ్యాషన్ ఇండస్ట్రీ లోనూ ఇది విరివిగా సద్వినియోగం అయ్యింది.

అయితే కరోనా సంక్షోభం కారణంగా ఫ్యాషన్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ప్రత్యేకించి వ్యక్తిగత లేబుల్స్ వ్యవస్థాపకులకు డిజిటల్ మాధ్యమాల ద్వారా మార్కెటింగ్ చేయడం ద్వారా కొత్తగా క్రియేటివ్ గా థింక్ చేయకపోతే ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థమైంది. ఈ అంటువ్యాధి వల్ల దుకాణాలకు వెళ్ళడం కంటే ఆన్ లైన్ షాపింగ్ ను ఎంచుకునే వారి సంఖ్య అమాంతం పెరిగింది. ఇటీవల ఆన్ లైన్ షాపింగ్ అనేది కొనుగోలుదారుల అనుభవాన్ని పూర్తిగా మార్చివేసింది.

“వర్చువల్ వరల్డ్ అనేది విస్త్రతిని పెంచుకుంటోంది. ఆన్ లైన్ లోనే చూసుకుని ఎంచుకోవడం అన్నది ఇక నుండి సర్వసాధారణం అవుతుంది.. బ్రాండ్లు .. లేబుల్స్ డిజిటల్ మాధ్యమంలో తమ గేమ్ ని మార్చేశాయి“ అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యాషన్ ఔత్సాహికుడు డిజైనర్ కం స్టైలిస్ట్ సుస్మిత అనాలా విశ్లేషించారు. ఆమె అభిప్రాయం ప్రకారం టాలీవుడ్ కొత్త ఎత్తులకు వెళుతోంది. పరిశ్రమలో ఫ్యాషన్ బాలీవుడ్ తో సమానంగా ఉంది. కొత్త ప్రతిభకు గొప్ప అవకాశాలు పెరిగాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత వికసిస్తుంది. అప్పటి వరకు వర్చువల్ వరల్డ్ లో కొత్త హైట్స్ ని జనాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆశిస్తున్నాం అని అన్నారు. ఎక్కడికో వెళ్లి సినిమాలు చూడడం ఏమిటి? ఎక్కడికో వెళ్లి కొనడం ఏమిటి? వర్చవల్ విజువల్స్ లో వీక్షించి సెలెక్ట్ చేయడమే కొనేది చూసేది ఏదైనా!!