‘కోబ్రా’లో టీంఇండియా క్రికెటర్ ఇలా

0

తమిళ స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం ‘కోబ్రా’లో నటిస్తున్న విషయం తెల్సిందే. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పఠాన్ నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో యూనిట్ సభ్యులు కలిగించారు. ఇక ఈ సినిమా లోని ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్ లుక్ ను ఆయన బర్త్ డే సందర్బంగా రివీల్ చేశారు.

ఇర్ఫాన్ పఠాన్ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. పఠాన్ కోపంతో చూస్తున్న ఈ ఫొటోను చూస్తుంటే సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడా అనిపిస్తుంది. అస్లాన్ పాత్రలో పఠాన్ కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ ను చూస్తుంటే క్లారిటీ వచ్చేస్తుంది. కోబ్రా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. క్రికెటర్ గా ఆల్ రౌండర్ ప్రతిభ కనర్చిన పఠాన్ ఇప్పుడు సినిమాల్లో కూడా ఆల్ రౌండర్ అనిపించుకుంటాడా చూడాలి. హ్యపీ బర్త్ డే పఠాన్.