బిబి4 : సమంతకు మామతో సమానంగా ఇచ్చారు

0

బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున కొన్ని వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను చేసేందుకు గాను మనాలీ వెళ్లిన విషయం తెల్సిందే. ఆ కారణంగా గత ఆదివారం నాగ్ స్థానంలో హోస్ట్ గా సమంత వచ్చింది. ఆమె దసరా మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించి పాస్ మార్కులు పొందింది. కాస్త లెంగ్త్ ఎక్కువ అయ్యిందనే కాని సమంత హోస్టింగ్ పై విమర్శలు రాలేదు. అందుకే ఆమెను మరికొన్ని వారాలు పొడిగించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. స్టార్ మా మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంతతో అయిదు వారాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారట.

ఈ అయిదు వారాలకు గాను సమంతకు రూ.2 కోట్ల రూపాయల పారితోషికంను ఇస్తున్నారట. శని ఆదివారం ఎపిసోడ్ లకు ఒక్క రోజు షూట్ చేస్తారు. అంటే సమంత ఒక్క రోజుకు గాను రూ.40 లక్షలకు ఎక్కువ పారితోషికం అందుకుంటుంది. నాగార్జున ఈ సీజన్ మొత్తంకు గాను రూ.8 కోట్ల పారితోషికంను అందుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే నాగ్ ఒక్క రోజుకు దాదాపుగా రూ.45 నుండి 50 లక్షల వరకు పారితోషికంగా పొందుతున్నాడు. అంటే సమంతకు కూడా ఈ అయిదు వారాలకు గాను ఏకంగా రెండు కోట్లు ఇస్తూ సమానమైన పారితోషికంను అందిస్తున్నారు.

సమంత గెస్ట్ హోస్ట్ గా వచ్చినా కూడా ఈ స్థాయి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. తెలుగు సరిగా మాట్లాడలేక పోయినా అంటే ఆమెకు తెలుగు మాట్లాడటం ఇబ్బందిగా ఉన్నా కూడా తెలుగు హోస్ట్ గా చేయడం అంటే చాలా కష్టమైన విషయం. అయితే ఆమె హోస్ట్ గా చేస్తే షో కు మంచి హైప్ వస్తుంది. అందుకే ఆమెతో హోస్టింగ్ చేయిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక్క వారం రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది. ఈసీజన్ లో మాత్రం అయిదు వారాలు గెస్ట్ హోస్ట్ అంటున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.