గుర్తించడంలేదని హర్ట్ అయిన ‘కలర్ ఫోటో’ హీరోయిన్..!

0

తెలుగమ్మాయి చాందినీ చౌదరి పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న చాందినీ.. ‘కేటుగాడు’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇదే క్రమంలో ‘కుందనపు బొమ్మ’ ‘మను’ ‘హౌరా బ్రిడ్జ్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలన్నీ విజయవంతం కాకపోవడంతో చాందినీ చౌదరి అంతగా ఫోకస్ అవలేదు. అందం అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆమెకు లక్ కలిసిరాకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోలేదని అనుకున్నారు. అదే సమయంలో మంచి సినిమా పడితే అమ్మడు మరో స్థాయికి వెళ్తుందని ఆశించారు. ఈ నేపథ్యంలో ‘కలర్ ఫోటో’ సినిమాలో మెరిసింది చాందినీ చౌదరి.

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ‘కలర్ ఫోటో’ సినిమాలో సుహాస్ కి జోడిగా చాందినీ నటించింది. ఇందులో చాందిని దీప్తి అనే పాత్రలో నేచురల్ పెర్ఫార్మన్స్ తో స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో చాందినీ తన నటనతో ఆడియన్స్ ని ఏడిపించింది. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖులు అందరూ మెచ్చుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. అయితే ఈ సినిమాని పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్న సెలబ్రెటీలు చాందినీ చౌదరి పేరును విస్మరిస్తున్నారు. కమెడియన్ హర్ష – హీరో సుహాస్ – విలన్ సునీల్ – దర్శక నిర్మాతలు సందీప్ రాజ్ – సాయిరాజేష్ – మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ లను మాత్రమే మెచ్చుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. మరి వాళ్ళు కావాలని చేసారో నిజంగానే ఆమెను మర్చిపోయారో తెలియదు కానీ చాందినీ మాత్రం దీనికి హర్ట్ అయినట్లు అర్థం అవుతోంది.

ట్విట్టర్ లో పలువురు నెటిజన్స్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘స్టోరీ మొత్తం చెప్పింది.. స్టోరీ తెలిసేలా చేసింది చాందిని పాత్ర. మేల్ అండ్ ఫిమేల్ యాక్టర్స్ మధ్య ఈ పక్షపాతం ఎందుకు.. సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకే’ అని ట్వీట్స్ పెడుతున్నారు. వీటిని చాందినీ చౌదరి రీట్వీట్స్ చేయడంతో ఆమె ఈ విషయంలో బాధ పడిందని తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్ యాక్టర్ జగపతిబాబు నిన్న ‘కలర్ ఫోటో’ చిత్రాన్ని ప్రశంసిస్తూ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. అయితే జగపతిబాబు సైతం హీరోయిన్ చాందినీ పేరు ప్రస్తావించలేదు. కనీసం ఆమెను ట్యాగ్ చేయకపోవడాన్ని తప్పుబడుతూ నెటిజన్స్ పెడుతున్న ట్వీట్స్ ని చాందినీ రీట్వీట్స్ చేసింది. మంచి స్పందన తెచ్చుకున్న సినిమా విషయంలో తనను గుర్తించకపోవడం చాందినీని బాగా హర్ట్ చేసినట్లు అర్థం అవుతోంది.