ప్రియుడిని పెళ్లాడిన వరల్డ్ నంబర్ వన్ హీరోయిన్

0

ప్రపంచంలోనే నంబర్ వన్ పారితోషికం అందుకునే కథానాయికగా స్కార్లెట్ జోహన్సన్ కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. భారీ క్రేజీ హాలీవుడ్ చిత్రాల్లో గ్రేట్ పెర్ఫామర్ గా యాక్షన్ నాయికగా స్కార్లెట్ జోహన్సన్ కి అసాధారణ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు తన చిరకాల ప్రియుడు కోలిన్ జోస్ట్ ని వివాహం చేసుకున్నారు. COVID 19 భద్రతా జాగ్రత్తలను అనుసరించి ఆత్మీయ వేడుక ను సింపుల్ గా కానిచ్చేయడం అభిమానుల్లో చర్చకు తావిచ్చింది.

2019 మేలో స్కార్లెట్ జోహన్సన్ – కోలిన్ జోస్ట్ నిశ్చితార్థం జరిగింది. అంతకుముందే ఈ జంట కొంతకాలంగా సహజీవనంలో ఉన్నారు. మీడియా ఇంటర్వ్యూలలో.. రెడ్ కార్పెట్ ప్రదర్శనల్లో జంటగా దర్శనమిచ్చారు. ప్రతి వేదికపైనా ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమ ప్రకటనలతో మంత్రముగ్దులను చేశారు. COVID-19 వల్ల పెళ్లి ప్రణాళిక డ్యామేజ్ అయ్యిందే కానీ అత్యంత వైభవంగా వివాహం చేసుకోవాలని భావించారు. కానీ.. ఏదీ కుదరలేదు. అందుకే కొద్దిమంది కొలీగ్స్ బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సంతోషకర వార్తను నూతన వధూవరులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కాని మీల్స్ ఆన్ వీల్స్ అమెరికా.. ఈ ఆత్మీయ వేడుక గురించి కొన్ని వివరాలను ఇన్ స్టాలో వెల్లడించింది. `జోస్ట్ మ్యారేడ్` అనే చమత్కారమైన శీర్షికతో స్టాటెన్ ఐలాండ్ ఫెర్రీ ఫోటోను పంచుకోవడంతో అసలు విషయం బయటపడింది. “స్కార్లెట్ జోహన్సన్ – కోలిన్ జోస్ట్ వారాంతంలో వారి కుటుంబంతో ఓ సింపుల్ వేడుకలో వివాహం చేసుకున్నారని చెప్పేందుకు చాలా ఆనందంగా ఉంది. సిడిసి నిర్దేశించిన COVID-19 భద్రతా జాగ్రత్తలను అనుసరించారు“ అని వివరాల్ని వెల్లడించారు.

ప్రపంచంలోనే నంబర్ వన్ పారితోషికం తీసుకునే కథానాయికగా స్కార్లెట్ పాపులర్. లూసీ లాంటి క్రేజీ చిత్రం సహా డీసీ సినిమాల్లోనూ స్కార్లెట్ సూపర్ గాళ్ తరహా పాత్రల్లో నటించారు. స్కార్లెట్ తదుపరి క్రేజీ సిరీస్ `బ్లాక్ విడో`లో నటాషా రోమనోఫ్ పాత్రను పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం 7 మే 2021 లో విడుదల కానుంది.