చందమామ పెళ్లి వేడుక చూతము రారండి!

0

అందాల చందమామ కాజల్ అగర్వాల్ తాను వలచిన గౌతమ్ కిచ్లుని పెళ్లాడేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఇరు కుటుంబ సభ్యులు పరిమిత బంధుమిత్రుల సమక్షంలో కోవిడ్ నియమాలు పాటిస్తూ వివాహానికి ఏర్పాట్లు చేసారు. ప్రస్తుతం ముందస్తు వివాహ ఉత్సవాల ఫోటోలు ఇంటర్నెట్ లో తుఫాన్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.

ఈ జంట ముంబైలో ఒక చిన్న ప్రైవేట్ వేడుకలో ఈ రోజు వివాహం చేసుకోనున్నారు. పెళ్లి రోజు ఉదయం కాజల్ తన హల్ది వేడుక నుండి ఒక అందమైన చిత్రాన్ని పంచుకుంది. ఈ ఫోటోలో నవ వధువు పసుపు రంగు దుస్తులలో ఎంతో చిల్లింగ్ గా కనిపిస్తోంది. పెళ్లి వేళ చందమామ చిలిపందం కన్నుల పండుగనే తలపిస్తోంది. కాజూ హల్దితో స్మెలీ గా కనిపించింది తాజా ఫోటోగ్రాఫ్ లో. `కాజ్ గౌత్ కిచ్డ్` అంటూ అందమైన కొటేషన్ ని ఈ ఫోటోకి జత చేసింది కాజల్.

కాజల్ వివాహానికి సంబంధించిన ప్రతిదీ ప్రయివేట్ ఎఫైర్. ఒక్కో ఫోటోతో ఇంటర్నెట్ లో సంచలనాలకు నెలవుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చందమామ అభిమానులు ఈ పెళ్లి వేడుక విశేషాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇక గౌతమ్ ని పెళ్లాడినా తాను నటననుంచి విరమించనని కాజల్ కచ్ఛితంగా చెప్పేసింది. తదుపరి భారతీయుడు 2 సహా పలు చిత్రాల్లో కాజల్ నటించాల్సి ఉంది.