స్టైలిష్ స్టార్ తో కలర్ ఫుల్ బ్యూటీ…!

0

‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా మెరిసింది తెలుగమ్మాయి చాందినీ చౌదరి. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న చాందినీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత ‘కలర్ ఫోటో’ రూపంలో సరైన హిట్ దొరికింది. ఇటీవలే ‘ఆహా’ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమెడియన్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో దీప్తి పాత్రలో నటించిన చాందినీ.. తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. టాలీవుడ్ ప్రముఖులందరూ తెలుగు హీరోయిన్ నటనను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం చాందినీ చౌదరి ని ప్రశంసించాడు.

ఇటీవల ‘కలర్ ఫోటో’ సినిమాని చూసిన బన్నీ చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. స్వీట్ లవ్ స్టోరీ – అద్భుతమైన సంగీతం – ఎమోషన్స్ మరియు పర్ఫార్మన్స్ లతో వెంటాడే చిత్రమని.. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూడటం సంతోషంగా ఉందని.. ‘కలర్ ఫోటో’ టీమ్ మొత్తానికి అభినందనలు అని బన్నీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ‘కలర్ ఫోటో’ హీరోయిన్ చాందినీ చౌదరి తో పాటు మిగతా సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా చాందినీ చౌదరి అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. బన్నీకి కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండగా ‘కేటుగాడు’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన చాందినీ చౌదరి.. కుందనపు బొమ్మ’ ‘మను’ ‘హౌరా బ్రిడ్జ్’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్నీ పరాజయం అవడంతో చాందినీ అంతగా ఫోకస్ అవలేదు. అందం అభినయం రెండూ కలబోసినా ఆమెకు అదృష్టం కలిసిరాకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోలేదని అందరూ అనుకున్నారు. అదే సమయంలో మంచి సినిమా పడితే అమ్మడు మరో స్థాయికి వెళ్తుందని ఆశించారు. ఈ నేపథ్యంలో ‘కలర్ ఫోటో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది చాందిని. ప్రస్తుతం చాందినీ చౌదరి కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.