యూట్యూబ్ ని షేక్ చేస్తున్న దేవరకొండ ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్..!

0

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ”మిడిల్ క్లాస్ మెలోడీస్”. వినోద్ అనంతోజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. మిడిల్ క్లాస్ కు చెందిన యువకుడు సిటీకి వెళ్లి సొంతంగా హోటల్ పెట్టే ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే పరిణామాలను ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధించి అరుదైన రికార్డ్స్ నమోదు చేస్తోంది.

‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్ విడుదలైన 6 రోజుల్లోనే 6 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. చిన్న హీరో.. అది కూడా రెండో సినిమాకే ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. ఫస్ట్ సినిమా ‘దొరసాని’ ప్లాప్ అందుకున్నప్పటికీ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగలిగాడు. ఇంత తక్కువ సమయంలో మూవీ ట్రైలర్ కి రికార్డు స్థాయి వ్యూస్ రావడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ ఇందులో రాఘవ అనే యువకుడిగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి పసుమర్తి స్టోరీ మరియు డైలాగ్స్ అందించాడు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం నవంబర్ 20న అమెజాన్ ఓటీటీలో రిలీజ్ కానుంది.