త్వరలోనే రేణుదేశాయ్ వెబ్ సీరిస్ విడుదల!

0

రేణుదేశాయ్ ‘ఆద్య’ అనే వెబ్సీరిస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా వెబ్సిరిస్గా ఇది తెరకెక్కుతున్నది. పవర్ఫుల్ లేడీ పాత్రలో రేణు అలరించబోతున్నదట. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. మంగళవారం నుంచి రామోజీఫిల్మ్సిటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్నది. ఈ వెబ్ సిరీస్ లో నందిని రాయ్ బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రేణుదేశాయ్ ఈ నటిస్తుండటంతో ‘ఆద్య’పై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఎంఆర్ కృష్ణ మామిడాల ఈ వెబ్సీరిస్ ద్వారాదర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రజనీకాంత్ ఎస్ డీఎస్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో రేణు ఈ చిత్రాన్ని ఒప్పుకున్నదని టాక్. జీవితంలో అన్ని కోల్పోయి.. నిలదొక్కుకొనే ఓ గొప్పస్త్రీమూర్తి పాత్రలో రేణు నటించబోతుందట. ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో. అన్నట్లు రేణు దేశాయ్ ప్రస్తుతం ఓ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తోంది. ప్రధానంగా ఈ చిత్రంలో రైతుసమస్యలను చర్చించబోతున్నట్టు టాక్. ఈ సినిమాలో నటించేముందు రేణుదేశాయ్ పలువురు రైతులను కలిసి వారి అనుభవాలను కలుసుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు ప్రస్తుతం సేంద్రియవ్యవసాయం చేస్తున్న గోరటి వెంకన్నను కూడా రేణుదేశాయ్ కలుసుకున్నారు.

రైతులపడే ఇబ్బందులు.. సేంద్రియసాగులో ఎదురయ్యే ఒడిదొడుకులు తదితర సమస్యలు ఈ వెబ్సీరిస్లో ప్రధానంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే వెబ్సీరిస్ అంటేనే బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలు అనే దోరణి ప్రేక్షకుల్లో ఉన్నది. అందుకు తగ్గట్టే దర్శకులు కూడా యువతను దృష్టిలో ఉంచుకొనే ఇటువంటి సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయం నేపథ్యంలో ఓ వెబ్సీరిస్ తెరకెక్కడం నిజంగా సాహసమే.