సమంత ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లేనా?

0

టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత మొదటి సారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే సీజన్ 2 లో నటించేందుకు సమంత ఒప్పుకుంది. హిందీ ప్రేక్షకుల ముందుకు సమంత మొదటి సారి వెళ్లబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదిగా కనిపించబోతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఆమద్య తన పార్ట్ కు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసినట్లుగా చెప్పింది. తెలుగు.. తమిళం మరియు హిందీల్లో ఈమె డబ్బింగ్ చెప్పింది.

తాజాగా మరోసారి ఈ వెబ్ సిరీస్ గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అనేది రూల్స్ ను బ్రేక్ చేసే విధంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ తో మొదటి సారి తాను రూల్స్ ను బ్రేక్ చేశాను. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను చూసి అంతా సర్ ప్రైజ్ అవుతారని సమంత పేర్కొంది. తనను కొత్తగా చూస్తారంటూ హామీ ఇచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అవ్వడం వల్ల చాలా విభిన్నమైన పాత్రలో తాను కనిపించబోతున్నట్లుగా పేర్కొంది. సమంత సర్ ప్రైజ్ అంటూ ఊరిస్తుంది కనుక ఖచ్చితంగా ఆమె ప్రచారం జరుగుతున్నట్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదిగా అంటే నెగటివ్ రోల్ లో కనిపించే అవకాశం ఉందనిపిస్తుంది. అతి త్వరలోనే అమెజాన్ ద్వారా ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.