ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ పై ఫ్యాన్స్ స్పెషల్ పోస్టర్

0

నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తన 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా నిలిచాడు. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి అభిమానంను చురగొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో కొమురం భీమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ ప్రస్థానంపై అభిమానులు ఒక అద్బుతమైన పోస్టర్ ను రెడీ చేశారు. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ ను చూపించే ప్రయత్నం చేశారు.

ఎన్టీఆర్ ఈ 20 ఏళ్లలో నటించిన సినిమాల తాళూకు కొన్ని ముఖ్యమైన సింబల్స్ ను మరియు ప్రతి సినిమాకు సంబంధించిన లుక్ ను ఈ పోస్టర్ లో చూపంచారు. అతి చిన్న దైన ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ 20 ఏళ్ల సినీ కెరీర్ ను చూపించడం నిజంగా అద్బుతంగా ఉందంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రతి సినిమా తాళూకు జ్ఞాపకంను ఈ పోస్టర్ లో చూపించారు. ప్రతిది ఇందులో చూపించడంతో పాటు అభిమానులకు ఈజీగా అర్థం అయ్యేలా సింబల్స్ ను కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు.