‘పుష్ప’లో మరో రింగ రింగా కన్ఫర్మ్

0

సుకుమార్.. దేవిశ్రీ కాంబోలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మ్యూజికల్ సక్సెస్ ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా వీరి కాంబో సినిమాల్లో వచ్చిన ఐటెం సాంగ్స్ మాస్ ఆడియన్స్ ను ఉ్రరూతలూగించాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా పుష్ప సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణకు కరోనా అడ్డు వచ్చింది. దాంతో ఆరు నెలలుగా షూటింగ్ ఆగిపోయింది. ఈ ఖాళీ సమయంను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పుష్ప మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు.

దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పుష్ప కోసం దాదాపు అన్ని ట్యూన్స్ ను రెండు మూడు వర్షన్ లుగా రెడీ చేసి పెట్టాడట. త్వరలోనే ఫైనల్ చేస్తారని సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా ఐటెం సాంగ్ విషయంలో దేవిశ్రీ చాలా పట్టుదలతో ఉన్నాడు. ఈమద్య కాలంలో తన బాణీల వేడి తగ్గుతుందనే విమర్శలు ఎదుర్కొన్న దేవిశ్రీ ఈ సినిమాతో ఆ విమర్శలకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే బన్నీతో గతంలో చేసిన ఆ అంటే అమలాపురం.. రింగ రింగల రేంజ్ లో ఐటెం సాంగ్ ను రెడీ చేశాడట.

దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన రింగ రింగ ట్యూన్ ను హిందీ మరియు తమిళంలో కూడా వాడుకున్న విషయం తెల్సిందే. అంతగా సక్సెస్ అయిన రింగ రింగ ఇంకా కూడా జనాల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో పుష్ప కోసం అలాంటి ఐటెం నెంబర్ ను ఇవ్వాలని దేవిశ్రీ కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకే చాలా సమయం కేటాయించి పుష్ప ఐటెం సాంగ్ ను ట్యూన్ చేశాడట. అల వైకుంఠపురంలో పాటల రికార్డులను ఆ పాట బద్దలు కొడుతుందో చూడాలి.