బిగ్ బాస్ లో ఈసారి స్టార్ కపుల్ లేనట్లే

0

తెలుగు బిగ్బాస్ సీజన్ 4 ప్రారంభంకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అవ్వడంతో పాటు వారు ఐసోలేషన్ కు కూడా వెళ్లిపోయారు. గత నెల నెలన్నర నుండి కూడా ఈసీజన్ లో ఖచ్చితంగా డాన్స్ మాస్టర్ రఘు మరియు ఆయన భార్య సింగర్ ప్రణవి ఉంటారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు వారు ఈ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ ఖండించలేదు. కనుక వారు జంటగా షోకు వెళ్లబోతున్నట్లుగా అంతా నమ్మకం పెట్టుకున్నారు. అయితే చివరి నిమిషంలో వీరు షో కు నో చెప్పారనే ప్రచారం జరుగుతోంది.

సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు బిగ్ బాస్ లో జంటగా వెళ్లడం అంటే చాలా పెద్ద రిస్క్ తీసుకోవడం అన్నమాట. చాలా ఓర్పు మరియు ఇద్దరి మద్య మంచి అవగాహణ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాణించగలరు. అదే సమయంలో బిగ్ బాస్ కు వెళ్లిన వారు కెరీర్ పరంగా లాభం పొందినది ఏమీ లేదు. కనుక జంటగా వెళ్లడం లేదా సింగిల్ గా వెళ్లడం కూడా దండగే అన్నట్లుగా కొందరు రఘుకు సలహా ఇచ్చారట. దాంతో రఘు దంపతులు పునరాలోచించారనే ప్రచారం జరుగుతోంది.

ఆ విషయం నిజమే అయితే ఈసారి హౌస్ లో స్టార్ కపుల్ లేనట్లే. గత సీజన్ లో వరుణ్.. వితికాలు సందడి చేసిన విషయం తెల్సిందే. ఈసారి అలాంటి ప్రత్యేకత ఏమీ ఉండక పోవచ్చు అంటున్నారు. ఈ ప్రశ్నతో పాటు మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. వాటన్నింటికి కూడా బిగ్ బాస్ ప్రారంభం రోజు సమాధానం దొరకనుంది.